గుంటూరు జీజీహెచ్ లో ఏడు జీబీ సిండ్రోమ్​కేసులు

by Thanuru Gopichand |

గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు ఏడు నమోదు అయ్యాయి

గుంటూరు జీజీహెచ్ లో ఏడు జీబీ సిండ్రోమ్​కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు ఏడు నమోదు అయ్యాయి.ఇప్పటికే ఈ వ్యాధి భారిన పడి శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై జిజిహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తనను కలిసిన మీడియాకు వివరణ ఇచ్చారు. తరచుగా ఇటువంటి కేసులు వస్తుంటాయని, ఈ నెలలో 7 కేసులు రావడం తో అప్రమత్తమయ్యామన్నారు. కోనసీమ జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా నుంచి ఈ వ్యాధి లక్షణాలతో రోగులు ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యాధి సోకినవారు అకస్మాత్తుగా కాళ్లు చేతులు నీరస పడిపోతాయని అన్నారు. చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి రావచ్చని తెలిపారు. అయితే త్వరలో రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఇది అంటూ వ్యాధి కాదన్నారు.

గుంటూరు జీజీహెచ్​కి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఈ రోజు వచ్చారు. న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు, విశాఖ, కాకినాడ బోధన ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నామని కృష్ణబాబు తెలిపారు. గులియన్​ బారీ సిండ్రోమ్​పై ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది లక్ష మందిలో ఒకరిద్దరికే వస్తుందన్నారు. రాష్ర్టంలో ఈ ఏడాది కేసులు సగటున సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఏదైనా వైరస్​బారిన పడి కోలుకున్న వారికి ఇది వచ్చే అవకాశం ఉందన్నారు. చేతులు, కాళ్లు చచ్చుబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయన్నారు. ఇమ్యునో గోబ్లిడ్​ వంటి ఖరీదైన మందులు వారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ సిండ్రోమ్​పై సీఎం చంద్రబాబు కూడా చర్చించారని తెలిపారు.

Next Story