శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. ఏడు గేట్లు ఎత్తివేత

by Jakkula.Mamatha |

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. ఏడు గేట్లు ఎత్తివేత
X

దిశ,వెబ్‌డెస్క్: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1,17,221 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం ఏడు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం ఈ రోజు(గురువారం) ఉదయం 6 గంటల సమయానికి 882.10 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 199.2737 టీఎంసీలు గా నమోదైంది.

అయితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లోలు పెరుగుతున్నాయని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యామ్ నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Next Story