ఏపీలో డిఫెన్స్​ క్లస్టర్​ ఏర్పాటు చేయండి

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్​ కోరారు.

ఏపీలో డిఫెన్స్​ క్లస్టర్​ ఏర్పాటు చేయండి
X

దిశ, ఏపీ బ్యూరో / డైనమిక్​ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్​ కోరారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రాజ్​ నాథ్​ సింగ్​ తో లోకేశ్​ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారుచేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టిస్తున్నామని చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు వివరాలను రాజ్ నాథ్ కు తెలియజేశారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని లోకేశ్​ వివరించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, ఎంపీలు ఉన్నారు.

Next Story