ఏపీలో సేవలు మరింత సులభతరం

by Thanuru Gopichand |

ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఏపీలో సేవలు మరింత సులభతరం
X

వాట్సప్​ గవర్నెన్స్​ను తీసుకు వచ్చాం..

క్వాంటం టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాం..

విశాఖలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సప్​గవర్నెన్స్​ను తీసుకు వచ్చామని , సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకు వస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్​జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్​ఏపీ సంచికను ఆవిష్కరించారు. సివిల్​సర్వీస్​అండ్​డిజిటల్​ట్రాన్స్​ఫార్మేషన్​అనే థీమ్​తో సదస్సు నిర్వహించారు. కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుపుతోంది. ఏఐ, సైబర్​సెక్యూరిటీ, పౌరసేవలు, అగ్రి స్టాక్​వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతోందనిఅన్నారు. తలసరి ఆదాయంలో మనవాళ్లే టాప్‌, ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తోంది తెలుగు వారే అని తెలిపారు.

ఐటీలో హైదరాబాద్‌ను అగ్రగామిగా మార్చాం, నాలెడ్జ్‌ ఎకనామీనే మనల్ని నడిపించబోతోందని సీఎం తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇవాళ అన్ని సేవలకు ప్రజలకు ఆన్​లైన్​లో అం దుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చని అన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి ఉన్నాడని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలను తీసుకు వచ్చారని తెలిపారు. క్వాంటం టెక్నాలజీపై మరింత దృష్టిపెడుతున్నామన్నారు. వాట్సప్​గవర్నెన్స్​తీసుకువచ్చామని తెలిపారు. ఐటీ రంగంలో భారతీయులకు చా లా నైపుణ్యం ఉందన్నారు. ఐటీ సంస్థలలో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీ వారే అని తెలిపారు. ప్రపంచంలో నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్​కు చెందిన వారే అన్నారు. నాలెడ్జ్​ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హైదరాబాద్​కు మేలు జరిగిందన్నారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి అని వివరించారు. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పనతో రూపురేఖలు మారాయని వివరించారు. ప్రముఖ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్​కంప్యూటింగ్​ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్​వంటి సంస్థలు వస్తున్నాయన్నారు. స్టార్టప్​లకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక సేవలు ఇటి వద్దకు తీసుకువచ్చేలా సంజీవని సేవలు ఉంటాయన్నారు. ధనిక, పేద తేడా లేకుండా యూనివర్సల్​హెల్త్​పాలసీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. హెల్త్​ పాలసీ ద్వారా రూ.2.50 లక్షల చొప్పున నగదు రహిత సేవలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్​వైద్య సేవ కింద పేదవారికి రూ.25 లక్షల వరకు చికిత్స ఉంటుందని సీఎం ప్రకటించారు.

Next Story