- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kakinada: భయాందోళనల మధ్యే సీరియల్ కిల్లర్‌కు శస్త్రచికిత్స
కరుడు కట్టిన సీరియల్ కిల్లర్ నిత్యనందన్‌కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: కరుడు కట్టిన సీరియల్ కిల్లర్ నిత్యనందన్(Serial killer Nithyanandan)కు ఎట్టకేలకు శస్త్రచికిత్స జరిగింది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనల మధ్యనే కాకినాడ జీజీహెచ్(Kakinada GGH)లో నిత్యానందన్ కంటికి వైద్యులు చికిత్స చేశారు. తమిళనాడు(Tamilnadu)కు చెందిన నిత్యానందన్‌పై 10 అత్యాచారాలు, 7 హత్య కేసులు ఉన్నాయి. యువతులపై అత్యాచారానికి పాల్పడి అత్యంతగా కిరాతకంగా చంపేశారు. దీంతో ఆయకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ఆయన్ను యానాం జైల్లో ఉంచారు.
అయితే ఈ మధ్య కాలంలో ఆయన కంటి భాగంలో గాయం అయింది. దీంతో కాకినాడ జీజీహెచ్‌లో నిత్యనందన్‌కు శస్త్ర చికిత్స చేయించాలని జైలు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నిత్యానందన్‌ను జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు ఉదయం శస్త్ర చికిత్స చేశారు. అనంతరం వార్డుకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది.






