- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ నేత హత్యకేసులో సంచలన తీర్పు
వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో (Narayanareddy Murder Case) కర్నూల్ జిల్లాకోర్టు (Kurnool District Court) సంచలన తీర్పు వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీవైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో (Narayanareddy Murder Case) కర్నూల్ జిల్లాకోర్టు (Kurnool District Court) సంచలన తీర్పు వెల్లడించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మొత్తం 29 మంది సాక్షులను విచారించిన కోర్టు.. 11 మందిని దోషులుగా నిర్థారించి వారికి జీవితఖైదు, రూ.1000 చొప్పున జరిమానా విధించింది. మరో ఐదుగురిని నిర్దోష్టులుగా ప్రకటించి, విడుదల చేసింది. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా.. ఐదుగురిపై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. మరో వ్యక్తి మృతి చెందాడు. కాగా.. తీర్పు అనంతరం తొగట్చేడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
2017 మే21న రామకృష్ణాపురంలో ఒక వివాహానికి హాజరై వస్తుండగా.. కృష్ణగిరి సబ్ స్టేషన్ వద్ద నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చారు. ఆయనతోపాటు ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు కూడా హత్యకు గురయ్యాడు. ఈ జంటహత్యల కేసులో 17 మంది నిందితులు కాగా.. ఒకరు మృతి చెందారు.






