AP News : విశాఖ కోర్టు సంచలన తీర్పు.. నరమేధం నిందితుడికి ఉరిశిక్ష

by Muthe.Rajitha |

ఓ నరమేధం కేసులో విశాఖపట్నం జిల్లా కోర్టు(Visakhapatnam District Court) సంచలన తీర్పు వెల్లడించింది.

AP News : విశాఖ కోర్టు సంచలన తీర్పు.. నరమేధం నిందితుడికి ఉరిశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ నరమేధం కేసులో విశాఖపట్నం జిల్లా కోర్టు(Visakhapatnam District Court) సంచలన తీర్పు వెల్లడించింది. అరుగురిని కిరాతకంగా హత్య చేసిన జుత్తాడ నరమేధం(Jutthada Murder Case) కేసులో నిందితుడికి ఉరిశిక్ష(Death Sentence) విధించింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో 2021 ఏప్రిల్ 20న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడు అప్పలరాజును అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ నిర్వహించారు.

పోలీసుల సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం.. నిందితుడు అప్పలరాజు, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని కిరాతకంగా హత్య చేసినట్లు కోర్టు తేల్చింది. కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను సమర్పించడంతో, న్యాయమూర్తి ఈ కేసును అత్యంత దారుణమైన నేరంగా పరిగణించారు. నిందితుడికి ఉరిశిక్షనే సరియైనది అంటూ శిక్ష ఖరారు చేశారు. జిల్లా కోర్టు తీర్పును బాధిత కుంటుంబం స్వాగతించింది.

Next Story