‘అధికారంలో లేకపోయినా.. మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్’.. వైసీపీ సంచలన ట్వీట్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-11 11:14:05  IST  )

ఏపీ(Andhra Pradesh)లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు.

‘అధికారంలో లేకపోయినా.. మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్’.. వైసీపీ సంచలన ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో మార్చి 22 వ తేదీన కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు.

లింగాల మండలం లోని నష్టపోయిన అరటి రైతులను వైఎస్ జగన్(Former CM YS Jagan) పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే 670 మంది రైతులకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం మాజీ సీఎం వైఎస్ జగన్ అందించారు. అధికారంలో లేకపోయినా.. అన్నదాతలకు ఇచ్చిన మాటని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ పేర్కొంది. ఈ క్రమంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది.

Next Story