- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harirama Jogaiah: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య సంచలన లేఖ
సూపర్ సిక్స్ తో పాటు ఆ పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సూపర్ సిక్స్ తో పాటు ఆ పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య అన్నారు. ఈ సందర్భంగా ఏపీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పారు. ముఖ్యంగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాధించిన షణ్ముక వ్యూహంలోని పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సూపర్ సిక్స్ లో కొన్ని పథకాలు ప్రజలకు ఎంత మేరకు లబ్ది చేకూర్చుతాయో షణ్ముఖ వ్యూహంలోని మని కొన్ని పథకాలు అంతకుమించి ప్రజలకు మేలు చేస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. యువకులకు 10 లక్షల వరకు సబ్సిడీని అందించే సౌభాగ్య పథకం చాలా గొప్పదని, దీనిని సూపర్ పథకాలతో పాటే అమలు చేయాలని యువత కోరుకుంటుందని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వానికి సంపద చేకూర్చే పథకాలపై దృష్టి పెట్టి వాటిని వెంటనే అమలు చేయాలని అన్నారు. చివరగా ఇట్టి సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తున్నానని హరిరామజోగయ్య లేఖ ద్వారా తెలియజేశారు.






