- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ నిరసనకు బడిపిల్లలు.. ఆలస్యంగా వెలుగులోకి సంచలన ఘటన
జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్లారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీసుకు వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంత్రి నారా లోకేష్ స్పందించి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే .. నిన్న అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఫీజు పోరు పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌కు చెందిన విద్యార్థులను కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు ఆ పార్టీ నేతలు తీసుకు వెళ్లారని శ్యామ్అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.
నిన్న, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారని తెలిపారు. ఎంఈవో, హెచ్ఎం కూడా ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించడం ఆశ్చర్యకరం అని పేర్కొన్నారు. తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రిలో చేరారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. ఎంఈవో, హెచ్ఎం బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం అని ఆయన తెలిపారు. ఈ ఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించ రాదని సూచించారు.
ఈ ట్వీట్‌కు వెంటనే నారా లోకేష్ స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. ’ అని ఆయన ఎక్స్‌వేదికగా ప్రకటించారు. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం అన్నారు. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆడుకోవద్దు అని ఆయన అన్నారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.






