- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రాజకీయ చరిత్రలోనే సంచలన పరిణామం.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన..!
ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ కూడా సాధించిన

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంత వరకు ఏ పార్టీ కూడా సాధించని రీతిలో ఘన విజయం సాధించబోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరో పవన్ కల్యాణ్ నేతత్వంలోని జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాల్లో దుమ్మురేపుతోంది. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం దిశగా జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. పోటీ చేసిన అన్ని చోట్ల గెలుపు దిశగా సాగుతూ జనసేన 100 పర్సెంట్ విన్నింగ్ స్ర్టైక్ రేట్ నమోదు దిశగా పయణిస్తోంది. అధికార వైసీపీ ప్రస్తుతం 10 సీట్లులోనే లీడ్లో ఉండటంతో టీడీపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్న జనసేన.. ఈ సారి అనుహ్యంగా పుంజుకుని పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు దిశగా సాగడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామంతో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా దక్కనుంది. ఎన్నికల ముందు వరకు కూడా గాజు గుర్తు విషయంలో జనసేన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ లిస్ట్ లో పెట్టడంతో జనసేన పలుమార్ల రిక్వెస్ట్ చేసిన తర్వాత గాజు గుర్తును ఈసీ జనసేనకు కేటాయించింది. తాజాగా జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో పాటు గాజు గుర్తు శాశ్వత సింబల్ గా దక్కడానికి కావాల్సిన ఓటింగ్ పర్సేంటేజ్ ను సాధించింది. దీంతో ఇక జనసేనకు గాజు గుర్తు విషయంలో నెలకొన్ని ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల భారీ విజయంతో పాటు, గాజు గుర్తు పార్టీ శాశ్వత సింబల్ దక్కడానికి మార్గం సుగమం కావడంతో జనసేన అభిమానులు, కార్యకర్తలతు ఫుల్ ఖుష్అవుతున్నారు. ఒకే ఎన్నికల్లో జనసేన డబుల్ జాక్ పాట్ కొట్టిందంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.






