విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో సంచలన విషయాలు

by velandi.Saikiran |   (  Updated:2025-05-19 23:44:30  IST  )

విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ వారం విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో

విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ వారం విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో పేలుళ్లకు.. కుట్రలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. స్లం ఏరియాలలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో గతంలో జరిపిన పేలుళ్ల మాదిరిగానే విజయనగరంలో జరపాలని స్కెచ్ వేసారట.

విజయనగరం నుంచి విశాఖ వెళ్లిపోయిన ఎన్ఐఏ అధికారులు... సిరాజ్ అలాగే సమీర్ లను ఇవాళ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సిరాజ్ తండ్రి అలాగే అతని సోదరుడిని విజయనగరం పోలీస్ స్టేషన్ లో విచారించబోతున్నారు అధికారులు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా అధికారులు ఇలాంటి విషయాలను.. గుర్తించారు.

ఇక అటు ఇప్పటివరకు పాకిస్తాన్ తో లింక్స్ ఉన్న 8 మంది అరెస్ట్ అయ్యారు. హరియాణాలో నలుగురు, పంజాబ్ లో ముగ్గురు, UPలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. వీరిలో యూట్యూబర్ జ్యోతి, విద్యార్థి దేవేందర్ సింగ్, సెక్యూరిటీ గార్డ్ నౌమన్ ఇలాహీ, వ్యాపారి షహజాద్, ముర్తాజా అలీ, అర్మాన్, గజాలా, యామిన్ ఉన్నారని సమాచారం. వీరంతా పాక్ ISISI కి సాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Next Story