- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీలక పాత్ర ఆయనదే.. నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు
ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ నకిలీ మద్యం కేసు(Ap Fake Liquor Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నిందితుడు టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి(Former TDP leader Jayachandra Reddy) పీఏ రాజేశ్, అకౌంటెంట్ అంగురసును రెండు రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు(Excise officials) కస్టడీ(Custody)లోకి తీసుకుని విచారించారు. అయితే రెండో రోజు విచారణలో నిందితులు కీలక విషయాలు తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంలో అద్దేపల్లి జనార్ధన్ రావుదే కీలక పాత్ర అని నిందితులు స్పష్టం చేశారు. 2025 జనవరిలోనే ములకలచెరువులో జనార్ధన్ రావు నకిలీ మద్యం తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. జులై నుంచి నకిలీ మద్యం తయారు చేసినట్లు నిందితులు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నం మాదిరిగానే అన్నమయ్య జిల్లా ములకల చెరువులోనూ నకిలీ మద్యం తయారు చేసిన సమీప గ్రామాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
ఇక ఈ కేసులో ఎక్సైజ్ పోలీసులు ఇప్పటివరకూ 29 మందిని విచారించారు. కీలక నిందితులు జయచంద్రారెడ్డి,ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి పరారీలో ఉన్నారు. జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్, అకౌంటెంట్ అంగురసును రెండు రోజులు కస్టడీ విచారణ తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.






