విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. భారత్‌ను ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే లక్ష్యంగా భారీ ప్లాన్

by Malleboina Mahesh |

విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసు విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలతో సిరాజ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి.

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. భారత్‌ను ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే లక్ష్యంగా భారీ ప్లాన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం ఉగ్ర కుట్ర కేసు విచారణ (Investigation into terror conspiracy case) కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలతో సిరాజ్ ఉర్‌ రెహ్మాన్‌ (Siraj ur Rehman)ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. హైదరాబాద్, ముంబై ప్రాంతాల మాదిరిగానే.. విజయనగరంలోని నాలుగు ప్రాంతాల్లో పేలుళ్లకు.. కుట్ర చేసినట్లు తేలింది. భారత్‌ను ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే లక్ష్యంగా ప్లాన్ చేసినట్లు విచారణలో ఉప్పుకున్నారు. అలాగే 20 మంది పాక్ యువకులతో అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల యువకులను చేర్చారు.

కాగా సిరాజ్ ఈ ఉగ్ర కుట్ర (violent conspiracy)ను మొత్తం విజయనగరం వేదికగా కొనసాగించాడు. గతంలో హైదరాబాద్ లో ఉద్యోగం చేసి వచ్చిన నిందితుడు సిరజ్.. తనకు ఏర్పడిన పరిచయాలతో ఈ ప్లాన్ చేశాడు. ఇందుకు సౌదీలో నివాసం ఉంటున్న ప్రముఖులతో పరిచయాలు ఏర్పాటు చేసుకొని.. ఓ ప్రత్యేక నెట్‌వర్క్ (Private network) డెవలప్మెంట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం సౌదీ నుంచి నిధులు సమకూర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టిఫిన్ బాక్స్ బాంబులతో పాటుగా మానవ బాంబుల (Human bombs) తయారీ లక్ష్యంగా సిరాజ్ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ కేసు విచారణలో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం కాగా ఈ ఉగ్రకుట్ర కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Next Story