- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో సైబర్ డెన్... 160 మంది యువతీ, యువకులతో వల
విశాఖలో సైబర్ డెన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో సైబర్ డెన్(Cyber Den) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు కాల్ సెంటర్ల ద్వారా విదేశీయులకు వల వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాగోతంలో మొత్తం 160 మంది యువతీ, యువకులు ఉన్నట్లు నిర్దారణ అయింది. విశాఖ అచ్యుతాపురం(Visakhapatnam Achyutapuram) కేంద్రంగా సైబర్ క్రైమ్(Cybercrime) కార్యకలాపాలు నడపడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపార్ట్ మెంట్‌లో ఇంతమంది యువతీ, యువకులు ఉంటున్న విషయాన్ని గతంలోనే స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసును ఎస్పీ తుహిన్ సిన్హా(SP Tuhin Sinha) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్‌ల వెనుక ముంబైకి చెందిన మహిళ కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు అపార్ట్‌మెంట్లు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. యువతీ యువకులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు. కొందరిని అదుపులోకి తీసుకుని పరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులందరికి ప్రతి నెల క్యాష్ రూపంలో జీతాలు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. దీంతో కీలక డేటాను సేకరించేందుకు ఐటీ, సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్స్ ప్రయత్నం చేస్తున్నారు.






