ఏపీ ఆక్వా రైతుల సంచలన నిర్ణయం.. క్రాప్ హాలిడే వైపు అడుగులు..!

by Vemula.Srinu Prasad |

క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు అడుగులు వేయబోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, పెరిగిన ఫీడ్ ధరలు, తగ్గించిన రొయ్యల రేట్లపై శుక్రవారం అమలాపురంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు...

ఏపీ ఆక్వా రైతుల సంచలన నిర్ణయం.. క్రాప్ హాలిడే వైపు అడుగులు..!
X

దిశ, వెబ్ డెస్క్: క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు(Aqua Farmers) అడుగులు వేయబోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, పెరిగిన ఫీడ్ ధరలు, తగ్గించిన రొయ్యల(Shrimp) రేట్లపై శుక్రవారం అమలాపురం(Amalapuram)లో రాష్ట్ర స్థాయి సమావేశం(State level conference) నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల అక్వా రైతులు పాల్గొన్నారు. డీలర్ల సిండికేట్‌తో తమను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ హాలిడే ప్రకటనతో ప్రభుత్వం దిగొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ తమతో ప్రభుత్వం చర్చలు జరపలేదని అంటున్నారు. క్రాప్ హాలిడేతో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణను ప్రకటిస్తామని ఆక్వా రైతులు తెలిపారు.

Next Story