‘ఓర్వలేక విషం కక్కుతున్నారు’.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

మాజీ సీఎం జగన్(Former CM Jagan) పై రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister) అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఓర్వలేక విషం కక్కుతున్నారు’.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) పై రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister) అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రెడ్డికి పూర్తిగా మతి చెడిందన్నారు. ఈ క్రమంలో ‘పాడిందే పాటరా అన్నట్లుగా చెప్పిన అబద్దాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు’ అని మంత్రి విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనను ఓర్వలేక విషం కక్కుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకం(Super Six Schemes)లో భాగంగా ఒక్కో పథకం అమలు చేస్తుంటే తట్టుకోలేక కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే చెప్పినవి, చెప్పనవి కలిపి 300 పైగా హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని మంత్రి వెల్లడించారు.

Next Story