‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి(BJP Leader Kiran Kumar Reddy) పేర్కొన్నారు.

‘ఎన్నికలంటేనే భయమేస్తోంది’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి(BJP Leader Kiran Kumar Reddy) పేర్కొన్నారు. విజయవాడ(Vijayawada)లో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి బీజేపీ(BJP) కృషి చేస్తోందన్నారు. ప్రజెంట్ ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందన్నారు.

ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ (BJP), రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు(Telugu States) నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగి పోయిందన్నారు. ‘ఎన్నికలంటే భయం వేస్తోందని.. రానున్న రోజుల్లో పోటీ చేయలేమని’ ఆయన వ్యాఖ్యానించారు. డబ్బు లూటీ చేసే వాళ్ళు కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలు వారికి ఓట్లు కూడా వేస్తున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Next Story