‘సీఎం చంద్రబాబుకు గతం గుర్తు రాదా?’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాజకీయాల్లో అధికార మార్పిడి సహజమని ఢీల్లి అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election) ఫలితాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Former Minister Kannababu) పేర్కొన్నారు.

‘సీఎం చంద్రబాబుకు గతం గుర్తు రాదా?’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాజకీయాల్లో అధికార మార్పిడి సహజమని ఢీల్లి అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election) ఫలితాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Former Minister Kannababu) పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గతం సీఎం చంద్రబాబు గుర్తుకు రాదా? అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చడంలో సీఎం చంద్రబాబు ఊసరవెల్లినే మించిపోయారని వైసీపీ నేత కన్నబాబు ఎద్దేవా చేశారు. గతంలో మోడీ డిక్టేటర్ అంటూ విమర్శించిన సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పుడు రైట్ లీడర్ అంటూ పొగడడం దారుణమన్నారు.

క్రేజీవాల్ ఓడిపోగానే బాబు కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. ‘గతంలో మోడీ హఠావో.. దేశ్ బచావో అంటూ విమర్శించారు. ప్రధాన మంత్రి మోడీ పై చేసిన వ్యాఖ్యలు అన్నీ రికార్డు అయ్యాయి. ప్రజలు అంత సులువుగా మర్చిపోరు’ అని కన్నబాబు మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించడం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు.

సంపద సృష్టితో సంక్షేమం ఇవ్వాలని అన్నారని గుర్తు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఉచితాలు విఫలం అయ్యాయని వైసీపీ నేత(YCP Leader) కన్నబాబు పేర్కొన్నారు. ఉచితాలు విఫలం అయితే.. సూపర్ సిక్స్ ఇస్తానని హమీలు చంద్రబాబు ఇచ్చారు. కానీ సీఎం చంద్రబాబు తీరు ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న’ అన్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నేత కన్నబాబు కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

Next Story