- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ambati Rambabu:డిప్యూటీ సీఎం పవన్ పై మాజీ మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం కంటే కూడా ‘సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం’ అన్నట్లుగా ప్రభుత్వ పెద్దల తీరు ఉందని ఆయన విమర్శించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice)ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) శుక్రవారం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు(శనివారం) సాయంత్రం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అప్పటికే కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని(ration rice) చూడటానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాహసోపేతంగా వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారులు తనను అడ్డుకున్నారని.. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. అంతేకాదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి బాధ్యత వహిస్తారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్ జరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ చెప్పే డైలాగులకు తగ్గట్లే ఆయనకు లెక్కలేనంత తిక్క ఉందని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.






