‘ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు’.. వైఎస్ జగన్ పై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలకు అలవాటుపడ్డారు అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

‘ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు’.. వైఎస్ జగన్ పై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలకు అలవాటుపడ్డారు అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ నాలుక ఎటు తిప్పినా అబద్దాలనే మాట్లాడుతుంది అని ఎద్దేవా చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా ఫేక్ బతుకు నుంచి మాత్రం జగన్ బయటపడలేకపోతున్నారని విమర్శించారు. అప్పులు నుంచి విద్యుత్ కొనుగోలు వరకు అన్నింటిపైనా అబద్ధాలనే చెప్పారు. ఇష్టానుసారంగా అప్పులు చేసి స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదే అని మంత్రి అనగాని విమర్శలు గుప్పించారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోందని చెప్పారు. యాక్సిస్ ఎనర్జీతో యూనిట్‌కు రూ. 5.12 చొప్పున ఒప్పందం చేసుకున్న జగన్ రెడ్డి రూ.2.10 కే ఒప్పందం చేసుకున్నట్లు నంగనాచిలా అబద్ధాలు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 4.74 శాతం అధికం. కానీ జగన్ రెడ్డి మాత్రం అంకెల గారడీ చేస్తున్నారు. అమరావతి రాజధానిపై ఇచ్చిన మాట తప్పి ప్రజలతో ఛీ కొట్టించుకున్న బుద్దిరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంకా వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైరయ్యారు.

Next Story