తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

ప్రశ్నించేవారిపై భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదు.

తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) ఇటీవల జరిగిన దాడి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurtulu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు తమపై కూడా దాడులు చేస్తారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడి యాదృచ్ఛికం కాదన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఆదేశాల మేరకే అంబటిపై దాడి జరిగిందని తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ ప్రశ్నించేవారిపై భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని తోట త్రిమూర్తులు హితవు పలికారు. అధికార పక్షం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి అరాచకాలను అరికట్టాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తోట త్రిమూర్తులు హెచ్చరించారు.

Next Story