‘దేవుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు సంబంధం లేదు’.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-17 06:46:38  IST  )

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఈ రోజు(గురువారం) వేకువజామున దర్శించుకున్నారు

‘దేవుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు సంబంధం లేదు’.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఈ రోజు(గురువారం) వేకువజామున దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో చెబుతున్నా రాయుడు హత్య, వినుత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కోణంలో నాపై వైసీపీ అభాండాలు వేస్తోంది’’ అని చెప్పారు. దేవుడు సాక్షిగా తనకు రాయుడు హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudhir Reddy) అన్నారు.

కాగా, శ్రీకాళహస్తి మాజీ జనసేన నేత కోట వినుత కారు డ్రైవర్ రాయుడు హత్య కేసులో సుధీర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి కోట వినుత వద్ద డ్రైవర్ గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనివాసులుది హత్యేనని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story