‘పథకాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు.

‘పథకాలపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీలను అమలు చేయడంలో విఫలమైందని బుగ్గన(Former Minister Buggana rajendranath) విమర్శించారు. పథకాల అమలు పై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హామీలపై నిలదీస్తే తోక కట్ చేస్తామంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు.

సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చి, 30 శాతం అప్పులు పెంచారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని అంటున్నారు. కానీ.. రాష్ట్రం(Andhra Pradesh)లో ఉచిత బస్సు ప్రయాణం, రైతుబంధు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 హామీలు ఏమయ్యాయని బుగ్గన ప్రశ్నించారు. అమలు చేయాలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే, రాష్ట్రంలో మద్యం తప్ప, ఏ వ్యాపారం సాగడం లేదని మాజీ మంత్రి బుగ్గన ఆరోపించారు. జీఎస్టీ వసూళ్లలో 24 శాతం ఆదాయం తగ్గిందని ఆయన విమర్శించారు.

Next Story