AP Intermediate : ఏపీ ఇంటర్ విద్యలో సంచలన మార్పులు

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

AP Intermediate : ఏపీ ఇంటర్ విద్యలో సంచలన మార్పులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో పెను మార్పులు చేస్తున్నట్టు పేర్కొంది. గురువారం మంత్రి లోకేష్(Minister Lokesh) అధ్యక్షతన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు(AP Intermediate Board) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఫిబ్రవరి చివరి వారంలోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఇంటర్ మ్యాథ్స్(Maths) లో ఏ,బీ అని రెండు పేపర్లు ఉండేవి, ఇకపై ఆ రెండిటినీ కలిపి ఒకే సబ్జెక్టుగా బోధించనున్నారు. అదేవిధంగా సైన్స్ లో బొటనీ(Botany), జువాలజీ(Zoology) సబ్జెక్టులు వేర్వేరుగా ఉండేవి.. ఇకపై ఆ రెండు విభాగాలను ఒకే సబ్జెక్టుగా చేయనున్నారు. ఇక జూనియర్ కాలేజీల్లో కొత్తగా ఎంబైపీసీ(MBiPC) కోర్సుకు అనుమతినిచ్చారు.

అంటే ఇంతకముందు మ్యాథ్స్, సైన్స్ విభాగాలు విడిగా ఉండేవి. విద్యార్థులు సైన్స్ గాని, మ్యాథ్స్ గాని చదవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్ చదవడానికి.. మ్యాథ్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఇంజనీరింగ్ చదవడానికి ఛాన్స్ ఉండేది. ఎంబైపీసీ వలన ఇపుడు ఒకే విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ రెండూ చదవొచ్చు. ఆ తర్వాత ఇష్టమైన దానిలో ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. అంతేకాకుండా ఇకపై ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు జూన్ 1 నుంచి కాకుండా.. ఏప్రిల్ 7 నుంచే ప్రారంభించనున్నారు.

Next Story