- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మాజీ మంత్రి దేవినేని ఉమ ఫోన్ కాల్ లీక్

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) ఫోన్ సంభాషణలు లీక్ అవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇసుక, మట్టి, మద్యం దందాపై లోకల్ జనసేన నేత కరాటం రాంబాబు (Karatam Rambabu)తో ఉమ మాట్లాడారు. అయితే, వారిద్దరి సంభాషణకు సంబంధించి ఓ ఆడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియోలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యే ఒక్క ఏడాదిలోనే రూ.100 కోట్లు సంపాదించారట కదా అని కరాటం రాంబాబును ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరు మరోలా ఉందిలే అని ఆయన బదులిచ్చాడు.
ఈ క్రమంలోనే ఉమ.. ఏడాదిలోనే అలా చెడ్డపేరు ఎందుకు తెచ్చుకుంటున్నారని రాంబాబుకు సర్దిచెప్పబోయారు. అక్రమ సంపాదన విషయంలో తాను ఇప్పటికే ఎమ్మెల్యేను మందలించానని రాంబాబు సమాధానమిచ్చాడు. దీంతో దేవినేని ఉమ కలుగుజేసుకుని టికెట్ ఇప్పించింది.. గెలిపించింది మీరే కదా అంటూ సెటైర్లు వేశారు. ప్రశ్నించిన పాపానికి తనపైనే అరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గంలో కొంత ఇబ్బంది ఉన్నా ఎమ్మెల్యే అక్రమాలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని రాంబాబు చెప్పుకోచ్చాడు. కూటమి ప్రభుత్వానికి ఇంత ఇబ్బంది కలుగుతున్నా.. పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదా అని ఉమ ప్రశ్నించగా.. హైకమాండే పట్టించుకోవడం లేదని కరాటం రాంబాబు బదులిచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆడియో కోసం లింక్ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1951566538797949159






