- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలనం :జైలులో చంద్రబాబు నిరాహార దీక్ష?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారా?

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారా? స్కిల్ స్కామ్‌లో తన అరెస్ట్ అక్రమమని పదేపదే వాదిస్తున్న చంద్రబాబు ఇక పోరాటానికే సన్నద్ధమయ్యారా? న్యాయస్థానాల్లో తనకు న్యాయం జరగడం లేదని భావిస్తున్నారా? ఈ నేపథ్యంలో నిరాహార దీక్షకు దిగనున్నారా?అంటే అవునే వాదన వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిరాహార దీక్ష చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున తనఅరెస్టు,తన కుమారుడు నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలు కేవలం తన కుటుంబం పై రాజకీయ కక్షసాధింపు కుట్రగా పేర్కొంటూ చంద్రబాబు నాయుడు నిరాహారదీక్షకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెంట్రల్ జైలులోనే నిరాహార దీక్ష చేయనున్నారు. రాజకీయ కుట్ర, తన అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ చంద్రబాబు ఆక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.
అదేరోజూ భువనేశ్వరి దీక్ష
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష చేస్తారని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. అలాగే అదే రోజు రా.7 గంకు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన వారు, దేశం మరియు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక 5నిమిషాల పాటు తమ ఇంట్లోని లైట్స్ అన్నిటిని ఆఫ్ చేసి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలియజేయాలి అని టీడీపీ పిలుపునిచ్చింది. నారా భువనేశ్వరి చేపట్టబోయే నిరాహార దీక్షలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం అందరికీ ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
Read More..
రేపు ఢిల్లీలో లోకేశ్ నిరాహార దీక్ష






