- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్‌కు ఊరట.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ సునీల్ కు ఊరట లభించింది. ఈ నెల 23 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ సునీల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు స్వల్ప ఊరట లభించింది. అరెస్ట్ చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అయితే తన తల్లికి అనారోగ్యం కారణంగా ఇవాళ్టి విచారణ నుంచి సునీల్ నాయక్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కానీ ఈనెల 23న మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో..
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో 7 రోజులుగా సునీల్ నాయక్‌ను పోలీసులు విచారించారు. అయితే ఈ రోజు విచారణకు హాజరుకాలేదు. ప్రతి రోజు 11.30 గంటల కల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఆయన ఈ రోజు రాలేదు. శుక్రవారం విచారణకు వస్తారో లేదోనని పోలీసులు అనుమానిస్తున్నారు. చూడాలి మరి.






