ఐపీఎస్ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్.. సస్పెన్షన్ పొడిగింపు

by Vemula.Srinu Prasad |

సీనియర్ IPS అధికారి సంజయ్‌కు బిగ్ షాక్ తగిలింది...

ఐపీఎస్ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్..  సస్పెన్షన్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ IPS అధికారి సంజయ్(Senior IPS officer Sanjay)‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం(Government) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సంజయ్ సస్పెన్షన్‌‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెలాఖరు వరకు ఉంది. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ DG‌గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత సంజయ్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సంజయ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని సంజయ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ మరో ఆరు నెలల పొడిగించడంతో సంజయ్‌కు దెబ్బ వరుస దెబ్బలు తగిలినట్లైంది.

Next Story