- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డికి అస్వస్థత
బీజేపీ (BJP) జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన సమావేశంలో ఈ ఘటన జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ (BJP) జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన సమావేశంలో ఈ ఘటన జరిగింది. సమావేశంలో భాగంగా వేదికపై మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి వెళ్లారు. అక్కడ నాయకులు, పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. పార్టీ నాయకత్వ నిర్మాణం, కార్యకర్తల అంకిత భావం వంటి అంశాలపై ప్రసగించారు. ప్రసంగం ముగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు దిగుతూ ఉన్నారు. వేదికపై నుంచి కిందకి దిగే క్రమంలో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. కింద పడిపోయిన ప్రకాష్ రెడ్డిని చూసి అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందిస్తూ ఆయనకు సహాయం చేసేందుకు పరుపరుగునా వచ్చారు. వెంటనే ఆంబులెన్స్ వద్దకు తీసుకెళ్లి అందులోకి ఎక్కించారు. అక్కడి నుంచి హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన జరగడంతో సమావేశంలో కొద్దిసేపు కలకలం రేగింది. ప్రకాష్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో సమావేశాన్ని నాయకత్వం యథావిధిగా కొనసాగించింది. ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు ముఖ్య నాయకులు, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.






