- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫీ మోజు: లారీని ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
by Ramesh Naini |
వాహనం నడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనం నడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. అల్లూరి జిల్లా పాడేరులోని చింతలవీధి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక మహిళ, ఇద్దరు యువకులు కలిసి స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Next Story






