- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారాంపురం ఎమ్మార్వో కృష్ణారెడ్డి సస్పెన్షన్
సీతారాంపురం ఎమ్మార్వో కృష్ణారెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఆశయాలకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తూట్లు పొడుస్తున్నారు. రూల్ ప్రకారం ప్రజలకు సేవలు చేయాల్సిందిపోయి డబ్బులకు కకృతి పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేసి ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తప్పు చేసి దొరికిపోతే సస్పెన్షన్ వరకూ పరిమితమవుతున్నారు. దొరక్కపోతే దర్జాగా ఉద్యోగంలో చెలామణి అవుతున్నారు. ఇలా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పని చేసి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మార్వో వ్యవహారం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా సీతారాంపురం ఎమ్మార్వోగా కృష్ణారెడ్డి పని చేస్తున్నారు. అయితే భూమి మ్యుటేషన్ కోసం నిబంధనలకు విరుద్ధంగా పని చేశారు. దీంతో కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కలెక్టర్.. ఎమ్మార్వో కృష్ణారెడ్డి తప్పు చేసినట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు.






