- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరకామణి రిట్ పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత పెంపు
పరకామణి రిట్ పిటిషనర్ శ్రీనివాసులకు పోలీసులకు భద్రత పెంచింది...

దిశ, వెబ్ డెస్క్: పరాకామణి(Parakamani) రిట్ పిటిషనర్, జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసరావు(Macharla Srinivasarao)కు పోలీసులు భద్రత పెంచారు. ఈ కేసు ఫిర్యాదుదారుడు సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని ఇటీవల అలిపిరి పోలీసులను కోరారు. దీంతో ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఈ మేరకు శ్రీనివాసులు ఇంటి వద్దకు ప్రతి గంటలకు రక్షక్‌తో పాటు బ్లూ కోట్ పోలుసులు సైతం వెళ్తున్నారు. శ్రీనివాసులు ఇంటి వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో నగదు చోరీకి గురయింది. దీంతో నిందితులను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లోక్ అదాలత్‌లో కేసును కొట్టివేశారు. దీంతో మాచర్ల శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు కొట్టివేయడం వల్ల నిందితులు తప్పించుకుంటారని,మరింత విచారణ చేయాలని హైకోర్టులో రిటి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, అలాగే అవినీతిని బయటకు తీయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో విచారణ కొనసాగుతోంది. ఇంతలో పరకామణి కేసు ఫిర్యాదుదారుడు ఏవీఎస్ వో సతీశ్ కుమార్ ట్రైన్ నుంచి కింద పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. దీంతో తనకు ప్రాణహని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆభ్యర్థించారు. ఈ మేరకు మాచర్ల శ్రీనివాసుల ఇంటి వద్ద గస్తీ పెంచారు.






