- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భద్రతా వైఫల్యం.. శ్రీవారి భక్తుల ఆగ్రహం.. కారణం ఏంటంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు నమ్ముతారు. ఇదిలా ఉంటే.. తిరుమల ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అధికారుల భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు పలువురు భక్తులు పాదరక్షలతో వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆలయ మహాద్వారం వద్ద ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. దీంతో భక్తులు పాదరక్షలను అక్కడే వదిలేసి ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో తనిఖీ సిబ్బంది భక్తులను గుర్తించక పోవడంతో భక్తులు పాదరక్షలతో కనిపించారు. ఆలయంలోకి భక్తులు ఎలా వస్తున్నారు? అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ(TTD) ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. కానీ.. ఉద్యోగులు గుర్తించకపోవడంతో పాదరక్షలతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు రావడంతో చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో భద్రత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు భక్తులు మండిపడుతున్నారు.






