నేటితో ప్రచారం పూర్తి.. పులివెందులలో అదనపు బలగాలతో భద్రత

by Gantepaka Srikanth |

పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Vontimitta) బైపోల్ ప్రచారం తుది దశకు చేరుకుంది.

నేటితో ప్రచారం పూర్తి.. పులివెందులలో అదనపు బలగాలతో భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Vontimitta) బైపోల్ ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులపై ఆంక్షలు విధించనున్నారు. కాగా, ఇన్ని రోజులు టీడీపీ, వైసీపీ ఎన్నికల నేతలు ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. ఒంటిమిట్టలో 11, పులివెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పులివెందుల, ఒంటిమిట్టలో కలిపి దాదాపు 500 మందిని బైండోవర్ చేశారు. ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది.

Next Story