- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే శాఖ శుభవార్త..ఇక మరింత వేగంగా సికింద్రాబాద్-విజయవాడ ప్రయాణం !
సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ పనులకు శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. విజయవాడ ( Vijayawada ) నుంచి సికింద్రాబాద్ ( Secunderabad ) మధ్య ప్రయాణించే వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ పనులకు శ్రీకారం చుట్టింది. వేగంగా రూ.188 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది రైల్వే శాఖ. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
విజయవాడ - సికింద్రాబాద్ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ పనులు తొందరగా పూర్తయితే రైళ్ల వేగం భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల గమ్యస్థానాలకు త్వరగానే చేరిపోవచ్చు. సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా మెరుగుపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ అలాగే తెలంగాణ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా మొంథా తుఫాన్ కారణంగా దాదాపు రెండు రోజుల నుంచి పలు రైళ్లు రద్దు అయ్యాయి. రైల్వే ట్రాక్ ల పైకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు.






