- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Secret camera: లేడీస్ హాస్టల్లో.. సీక్రెట్ కెమెరాలు
ఏపీలో ఓ లేడీస్ హాస్టల్ లో బాత్రూంలో కెమెరాలు ఏర్పాటు చేశారు అంటూ బాధితులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

విద్యార్థినుల ఫిర్యాదుతో గుట్టురట్టు!
గుంటూరులో ఓ ప్రైవేటు హాస్టల్నిర్వాహకుల నిర్వాకం
హాస్టల్యజమాన్యం వేధింపులకు గురిచేస్తోందంటూ విద్యార్థినుల ఫిర్యాదు
విచారణ చేపట్టిన పోలీసులు .. హాస్టల్‌కు వచ్చి తనిఖీలు
దిశ డైనమిక్ బ్యూరో : ఏపీలో ఓ లేడీస్ హాస్టల్ లో బాత్రూంలో కెమెరాలు ఏర్పాటు చేశారు అంటూ బాధితులు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. గుంటూరు (Guntur) బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్ (Ladice Hosterl)లో బాత్రూం (Bath room) ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ అమ్మాయిలు పోలీసులను ఆశ్రయించారు. అరండల్‌పేట పోలీసులు అక్కడి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులు రాగా వారికి బాధిత యువతులు పలు విషయాలు వెల్లడించారు. హాస్టల్ నిర్వాహకులపై పలు ఆరోపణలు చేశారు. యజమాని కుమారుడు ఎప్పుడు పడితే అప్పుడు హాస్టల్ గదుల్లోకి వస్తారని, హాస్టల్ లోపల అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. బాత్రూంలో వద్ద కూడా కెమెరాలు ఉన్నాయన్నారు. రాత్రి వేళ బయట వ్యక్తులు వచ్చిపోతున్నారని వారు తెలిపారు. పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. యజమాని భార్య కూడా బూతులు తిడుతూ వేధిస్తుందన్నారు. తమ కాలేజీవారు ఆ హాస్టల్‌నే ప్రిఫర్చేశారని అందుకే అక్కడే ఉంటున్నామని తెలిపారు. కులంపేరు తెలుసుకుని తీవ్రంగా తిడతారని అన్నారు. కెమెరాలు పెట్టిన విషయం అడిగితే మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్లండి అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులు హాస్టల్‌కు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. హాస్టల్యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ అరవింద్కుమార్తెలిపారు. తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసిందన్నారు. వాష్‌రూమ్‌కు అత్యంత సమీపంలో సీసీ టీవీలు ఏర్పాటు చేశారని విద్యార్థినులు తెలిపారు. ప్రసాద్అనే వ్యక్తి, అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థినుల్లో అనేకమంది మైనర్లు ఉన్నారని తెలిపారు. దీంతో పాటు నగరంలో ఉన్న పలు హాస్టళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనగుతోంది. ప్రజాసంఘాలన నేతల అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గత ఏడాది ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్హాస్టల్లో సీక్రెట్కెమెరాల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను విక్రయిస్తున్నాడంటూ అదే కాలేజిలో చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కూడా దాడి చేశారు. తరచూ ఇటువంటి ఘటనలను వెలుగుచూస్తుండడం విద్యార్థినుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది






