AP Assembly: రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-12 04:10:20  IST  )

రెండోరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2026-27 సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

AP Assembly: రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండోరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2026-27 సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో మంత్రులు తమతమ శాఖలకు సంబంధించిన పత్రాలను ప్రవేశపెట్టనున్నారు. నిన్న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా.. నేడు ఆయన ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చించనున్నారు. కాగా.. నేటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ అమల్లోకి వచ్చింది. సంతకాలు చేసి వెళ్లిపోయేవారికి ఈ విధానంతో ఏపీ ప్రభుత్వం డిజిటల్ చెక్ పెట్టింది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని, లేదంటే సభకు రానట్లేనని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రతిరోజూ జీరో అవర్ లో 10 ప్రశ్నలకు మాత్రమే అనుమతిస్తారు. 10 గంటలకు ప్రశ్నోత్తరాలను ముగించి.. ౮ సవరణ ఆర్డినెన్సులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఎల్లుండి మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. నేడు మంత్రి గొట్టిపాటి రవికుమారు విద్యుత్ సుంకం -2025 సవరణ బిల్లును, హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ అగ్నిమాపక సేవ సవరణ ఆర్డినెన్సును సభలో ప్రవేశపెట్టనున్నారు.

Next Story