చదివేది సెకండ్ క్లాస్..ఈ బుడ్డోడు ఇంగ్లీష్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సర్పంచ్ గారు అంటూ!

by velandi.Saikiran |

సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ బుడ్డోడు మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో వైరల్ గా మారింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా

చదివేది సెకండ్ క్లాస్..ఈ బుడ్డోడు ఇంగ్లీష్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..  సర్పంచ్ గారు అంటూ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లీష్... చాలా గొప్పది. మన తెలుగుతో పాటు కచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఇంగ్లీష్ చాలా అవసరం. ఇంగ్లీష్ లేకపోతే.. వేరే దేశాలలో బతకడం చాలా కష్టమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో యూకేజీ నుంచే చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సెకండ్ క్లాస్ చదువుతున్న ఓ బుడ్డోడు మాట్లాడిన ఇంగ్లీష్ వీడియో వైరల్ గా మారింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. తన స్టైల్ లో ఇంగ్లీషులో స్పీచ్ ఇచ్చాడు ఈ కుర్రాడు. ఇటీవల 79వ ఇండిపెండెన్స్ డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. దేశంలోని నలుమూలల జాతీయ జెండాను ఎగురవేశారు. ఇక ఈ నేపథ్యంలోనే... ఏపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో... సెకండ్ క్లాస్ చదువుతున్న కుర్రాడితో ఇంగ్లీష్ స్పీచ్ ఇప్పించారు టీచర్లు.

ఇక టీచర్లు చెప్పినట్లుగానే... తనకు వచ్చినంత వరకు ఇంగ్లీషులో అదరగొట్టాడు ఈ బుడ్డోడు. Respected సర్పంచ్ గారు... Respected టీచర్స్ అంటూ స్పీచ్ మొదలుపెట్టి.. మహాత్మా గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ గురించి గుర్తు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ కుర్రాడి పేరు దేవాన్ కుమార్ అని స్పీచ్ లోనే వెల్లడించాడు. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. నువ్వు అబ్దుల్ కలాం అంతటి వాడివి అవుతావు అంటూ మెచ్చుకుంటున్నారు. క్లిక్

Next Story