- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. హిందూపురంలో మహిళకు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం హిందూపురం గ్రామీణ మండలం కిరికెరలో నివసించే మరియమ్మ అనే మహిళకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా వ్యాధి సోకినట్లు తేలింది. ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి మరియమ్మకు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె స్థితిని పర్యవేక్షిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పొదలు అధికంగా ఉండే గ్రామీణ, నగర ప్రాంతాల్లో తెల్లని నల్లి లాంటి చిన్న పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హితవు పలికారు.






