దిత్వా తుఫాను ఎఫెక్ట్.. రేపు స్కూళ్లకు సెలవు!

by Muthe.Rajitha |

దిత్వా తుఫాను అటు తమిళనాడును, ఇటు ఏపీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం తుఫాను బలహీన పడటంతో తమిళనాడులో, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిత్వా తుఫాను ఎఫెక్ట్.. రేపు స్కూళ్లకు సెలవు!
X

దిశ, వెబ్ డెస్క్ : దిత్వా తుఫాను అటు తమిళనాడును, ఇటు ఏపీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం తుఫాను బలహీన పడటంతో తమిళనాడులో, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈరోజు తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అయితే ఇప్పటికే తుఫాను బలహీనపడటంతో రేపు విద్యాసంస్థలకు సెలవుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో రేపు అన్ని స్కూళ్ళు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి.

ఇక తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రేపు కూడా సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న అన్ని యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ తో సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

Next Story