రేపు స్కూళ్లు బంద్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు(Private Schools) కీలక నిర్ణయం తీసుకున్నాయి.

రేపు స్కూళ్లు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు(Private Schools) కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధిస్తున్నందున రేపు అన్ని ప్రైవేటు స్కూళ్లు బంద్ చేసి, నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అంతేగాకుండా.. రేపు స్కూళ్లు బంద్ చేశామని.. దయచేసి తమకు సహకరించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా స్కూల్ యాజమాన్యాలు మెసేజ్లు కూడా పంపారు.

Next Story