బ్రేకింగ్ న్యూస్.. మరోసారి స్కూళ్లకు సెలవులు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-18 06:15:15  IST  )

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్.. మరోసారి స్కూళ్లకు సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఏపీలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు విశాఖపట్నం జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎల్. చంద్రకళ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసారు.

Read More Cinema News

Life Style news

Next Story