Nara Lokesh: మంగళగిరి లో ‘ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’

by Thanuru Gopichand |

మంత్రి నారా లోకేశ్​విజ్ఞప్తి మేరకు రూ.15 కోట్ల అంచనా తో మంగళగిరి లో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది.

Nara Lokesh: మంగళగిరి లో ‘ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
X

రూ.15 కోట్ల అంచనాతో ఏర్పాటుకు అంగీకారం

20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో శిక్షణా కేంద్రాల ఏర్పాటు

మంత్రి లోకేశ్​సమక్షంలో అవగాహన ఒప్పందం

దిశ ఏపీ బ్యూరో: మంత్రి నారా లోకేశ్​విజ్ఞప్తి మేరకు రూ.15 కోట్ల అంచనా తో మంగళగిరి లో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కు ఆ కంపెనీ అంగీకారం తెలిపింది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి లోకేశ్​చొరవతో ఏపీ ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027 వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ లను ఏర్పాటుచేస్తారు. ఈ ల్యాబ్ లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామగ్రి కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు రూ. 5 కోట్లు ఖర్చుచేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది. అనంతపురం లో ష్నైడర్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో ష్నైడర్ ఎలక్ట్రిక్ మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్ పైలెట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్​సీఈవో జి.గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంట్రీ హెడ్ అండ్​మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శర్మ, సీనియర్ జనరల్ మేనేజర్ రిచా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story