‘ఇలా చేయడం ద్వారా సమయం ఆదా’.. రైతులకు మంత్రి కీలక సూచనలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ఇలా చేయడం ద్వారా సమయం ఆదా’.. రైతులకు మంత్రి కీలక సూచనలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆరుగాలం శ్రమించే రైతులకు వ్యవసాయాన్ని సులభతరం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 80 శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు అందిస్తోందని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో వ్య‌వ‌సాయానికి ఉప‌యోగించే డ్రోన్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం డ్రోన్ ప‌నితీరును పరిశీలించి, నందిగాం మండలం నరేంద్రపురం రైతులకు డ్రోన్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగుకు సాంకేతికతను జోడిస్తే కూలీ ఖర్చులు, సమయం ఆదా అవుతుందని అన్నారు. ఒక ఎకరంలో పురుగు మందు పిచికారి చేయడానికి డ్రోన్ కు ఏడు నిమిషాలు సమయం తీసుకుంటుందని వివరించారు. అదే రైతు భుజాన వేసుకుని స్ప్రే చేయాలంటే రెండు గంటల సమయం తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్క రైతు కాలానుగుణంగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ వాడకంతో సాగు ఖర్చు తగ్గి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. పంటల పెరుగుద‌ల , తెగుళ్ల నియంత్రణను పర్యవేక్షించడంతోపాటు దిగుబడి పెంచడానికి డ్రోన్ లు సహాయపడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Next Story