- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడమ్.. నిధులు విడుదల చేయండి: నిర్మలా సీతారామన్‌ను కోరిన సత్యకుమార్
వైద్య సేవలకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను సత్యకుమార్ కోరారు..

దిశ, వెబ్ డెస్క్: రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి సత్యకుమార్(Minister Satyakumar) తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో వైద్య శాఖపై దృష్టి సారించారు. ఆస్పత్రులను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిధులు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman)ను కలిశారు. రాష్ట్రంలో వైద్య శాఖకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, గత ప్రభుత్వం అన్ని సంస్థలను ధ్వంసం చేసిందని తెలిపారు. వైద్య శాఖను సైతం నిర్వీర్యం చేశారని చెప్పారు. ప్రజలకు తమ ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని సత్యకుమార్ కోరారు.






