గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు.. తగ్గేదే లే అంటూ యాక్షన్

by Naga Rani Yarlagadda |

ఏపీ మాజీమంత్రి అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు.

గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు.. తగ్గేదే లే అంటూ యాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన లక్కీ డ్రా పై ఆయనపై కేసు నమోదవ్వగా.. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ను కోర్టులో హాజరు పరిచారు. సంక్రాంతి సంబరాల్లో నిర్వహించిన లక్కీ డిప్ నిర్వహించేందుకు డ్వాక్రా మహిళలకు లాటరీ టికెట్లను అంటగట్టారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రధానంగా ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అంబటి రాంబాబుపై సెక్షన్ 420 కింద కేసు నమోదవ్వగా.. దానిపై పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అంబటి రాంబాబును తరలించారు. దీనిపై వాదోపవాదనల తర్వాత బెయిల్, రిమాండ్ పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా.. కోర్టుకు వచ్చిన అంబటి రాంబాబు.. తన అనుచరులు, అభిమానులకు తగ్గేదే లే అని పుష్ప సినిమాలో పుష్పరాజ్ స్టైల్ ను ప్రదర్శించారు.

Next Story