‘పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు’.. వైసీపీ సీనియర్ నేత సెటైరికల్ ట్వీట్!

by Jakkula.Mamatha |

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు’.. వైసీపీ సీనియర్ నేత సెటైరికల్ ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సెటిల్‌మెంట్లలో తలదూర్చుతున్నారన్న ఆరోపణలపై బాధితులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో ‘‘ఎట్టకేలకు డీఎస్పీ జయసూర్యను బదిలీ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. డీఎస్పీ జయసూర్య పై అక్రమ జూదం, సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే నిన్న(గురువారం) డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించిన విషయం తెలిసిందే.

Next Story