- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర పండుగగా సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలు : మంత్రి అనగాని
by Naga Rani Yarlagadda |
పుట్టపర్తి సత్యసాయిబాబా మహా సమాధిని మంత్రులు, అధికారులు దర్శించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పుట్టపర్తి సత్యసాయిబాబా మహా సమాధిని మంత్రులు, అధికారులు దర్శించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ సత్యసాయి శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఏర్పాటైన మంత్రులు, అధికారుల కమిటీ మంగళవారం పుట్టపర్తిలో పర్యటించింది. ఈ సందర్భంగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ, సత్యకుమార్ లు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సత్యసాయి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 23 వరకూ జరిగే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
Next Story






