- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన ముందు నడయాడిన దైవం సత్యసాయిబాబా : సీఎం
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా (Puttaparthi Satya Saibaba) శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా (Puttaparthi Satya Saibaba) శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. బాబా జయంతి సందర్భంగా నేడు జరుగుతున్న వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) హాజరయ్యారు. సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న సీఎం మాట్లాడుతూ మన ముందు నడయాడిన దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నారు. బాబా శత జయంతిని పురస్కరించుకొని ఆయన చూపిన సేవా మార్గాన్ని అనుసరిద్దామని ప్రజలను కోరారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గం, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారంతో సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారన్నారు. ప్రపంచానికి సాయి సిద్దాంతం ద్వారా జ్ఞానాన్ని, సన్మార్గాన్ని చూపించారన్నారు. పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారన్నారు. అందరినీ ప్రేమించు... అందరినీ సేవించు అంటూ... మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించి.. నిరూపించారని కొనియాడారు. విద్య, వైద్యం, తాగునీరు, మానసిక ప్రశాంతత వంటి కార్యక్రమాలతో కోట్ల మంది జీవితాల్లో మార్పులు తెచ్చారని తెలిపారు. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్య సాయికి మరొక్కమారు దివ్యాంజలి ఘటిస్తున్నానని ప్రకటించారు.
నా పూర్వజన్మ సుకృతం : మంత్రి లోకేష్
ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థం అని బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమతత్వమే మానవత్వం.. సమానత్వమే సాయి తత్వం.. అని చాటి చెప్పిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తానూ పుట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అన్నారు. భగవాన్ శతజయంతి ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టం అభివర్ణించారు. విద్య, వైద్య, ప్రజావసరాలు తీరుస్తూ.. సేవాభావమే దైవత్వం అని నిరూపించిన సత్యమూర్తి, సత్యస్ఫూర్తి శ్రీ సత్యసాయిబాబా అని కొనియాడారు. భగవాన్ చూపిన మార్గంలో పయనిస్తూ... ప్రజాసేవకు అంకితమైన కోట్లాదిమంది భక్తులు సత్యసాయి ప్రతిరూపాలని తెలిపారు.






